పాముకాటుకు ముగ్గురు పసివాళ్ళు బలి
అనంతపురంః అనంతపురం పట్టణ శివారులోని కందుకూరులో శనివారం ఉదయంఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పసివాళ్ళు పాముకాటుకు బలయ్యారు. నారాయణ ముగ్గురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని పాము కాటేసింది. ఇంట్లోనే పాముపుట్ట వుండగాఅందులో నుంచి వచ్చిన పాము ఈ ముగ్గురుని బలిగొంది.
నాగేంద్రస్వామి భక్తుడైన నారాయణ చాలాకాలంగా తన ఇంట్లో వున్న పాముల పుట్టకు పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం ఉదయాన్నే నిద్రిస్తున్న తన కుమారుడుపెద్దగా కేకవేయడంతో అతనిని పరిశీలించగా పాము కాటేసినట్లు గుర్తించానని,అప్పటికే ఆ పాము మిగిలిన ఇద్దరిని కూడా కాటేసిందని నారాయణ చెప్పాడు. ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ తన ముగ్గురు పిల్లలకు నాగేంద్ర, నాగమ్మ, నాగరాజు అనిపేర్లు కూడా పెట్టానని, ఇప్పుడు ఆ నాగేంద్రుడే సంతానాన్ని హరించాడని అతను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
నారాయణ పాముకోసం గాలించగా పిల్లలు నిద్రపోతున్న దిండుకిందే అది కనబడింది. ఇరుగుపొరుగులు ఆ పామును కూడా చంపారు. ఈ సంఘటన అనంతపురంలో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications