పుల్లెల గోపీచంద్ పరాజయం
బ్రూనైః భారత్ నెంబర్ వన్ ఆటగాడు పుల్లెల గోపీ చంద్ శుక్రవారం జరిగిన వరల్డ్ గ్రాండ్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో ఇండొనీసియా ఆటగాడు మార్లెవ్ మైనాకీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇటీవలే ఇండొనీసియా ఓపెన్‌సెమీ ఫైనల్లో గోపీ చంద్ ను ఓడించిన మైనాకీ మరోసారి గోపీచంద్ పై నెగ్గిసెమీస్ లోకి దూసుకెళ్ళాడు. ఆటప్రారంభంలో మంచి షాట్లతో అలరించిన గోపీ చంద్ ఆ తరువాత మైనాకీ దూకుడును ప్రతిఘటించలేక పోయాడు.
7-5,7-4,7,3 స్కోర్లతో కేవలంఅరగంటలోనే గోపీచంద్ పరాజయం పాలయ్యాడు. రెండు వారాల కిందటే తనను ఓడించిన మైనాకీని మట్టికరిపించేందుకు గోపీచంద్ కొత్త వ్యూహాన్ని అనుసరించినప్పటికీ అది ఫలించలేదు. మైనాకీతో పరాజయంతో గోపీచంద్ ఈ టోర్నమెంట్ నుంచి కూడా వైదొలగాడు.












Click it and Unblock the Notifications