Missile: ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..! కేంద్రం మరో సంచలనం..!

భారత రక్షణరంగంలో మరో కీలక మలుపు. ఇప్పటివరకూ రక్షణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలకు తోడు ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలోకి దూకబోతున్నాయి. ఇందుకు కేంద్రం తలుపులు తెరిచేందుకు సిద్దమవుతోంది. ముఖ్యంగా నానాటికీ పెరిగిపోతున్న రక్షణ అవసరాలు, మిత్ర దేశాలకు సైతం సరఫరా చేయాల్సిన పరిస్ధితులు కేంద్రాన్ని ఈ దిశగా పురిగొల్పుతున్నాయి. దీంతో త్వరలో క్షిపణుల తయారీలో (Missile Manufacturing) ప్రైవేటు రంగానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు.

Taj Mahal గతంలో శివాలయమా ? తేజో మహాలయపై హైకోర్టులో కేంద్రం, ఏఎస్ఐ..!
Taj Mahal గతంలో శివాలయమా ? తేజో మహాలయపై హైకోర్టులో కేంద్రం, ఏఎస్ఐ..!

తాజాగా ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటనలో అక్కడి ప్రభుత్వం మన డీఆర్డీవో తయారు చేసిన అస్త్ర క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. దీంతో ఇండోనేషియాకు అస్త్ర క్షిపణులు సరఫరా చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. అలాగే పలు గల్ఫ్ దేశాలు కూడా భారత్ క్షిపణుల్ని, ఇతర రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రైవేటు రంగానికి కూడా ఇందులో అవకాశం కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.

missile production to private- centre s big defence reform amid growing demands
ఇథనాల్ పెట్రోల్ వినియోగదారులకు బిగ్ షాక్-తేల్చేసిన కేంద్రం..!
ఇథనాల్ పెట్రోల్ వినియోగదారులకు బిగ్ షాక్-తేల్చేసిన కేంద్రం..!

వాస్తవానికి భారత్ ఇప్పటికే రక్షణ రంగంలోని పలు విభాగాల్లో ప్రైవేటు సంస్థల ఎంట్రీకి తలుపులు తెరిచింది. ఇందులో క్షిపణుల తయారీకి ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఇది దేశ రక్షణ రంగ చరిత్రలోనే కీలక సంస్కరణ అవుతూందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ మేరకు రక్షణ శాఖ ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలుకబోతోంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే అస్త్ర 2 మార్క్ క్షిపణుల తయారీకి ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానించబోతున్నారు. ఇందులో ఐకామ్, అదానీ, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి సంస్థలు పోటీలో ఉండే అవకాశం ఉంది. అస్త్ర 2తో ప్రారంభించి తర్వాత ప్రళయ్ క్షిపణుల్ని కూడా వీరికి అప్పగించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+