వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి శుభవార్త. సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సివిల్స్ మెయిన్స్ రాసేవారికి గుడ్ న్యూస్

రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇచ్చే నిధుల ద్వారా ఈ సంవత్సరం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్టు సింగరేణి సంస్థ వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా upsc సివిల్ సర్వీసెస్ పరీక్షలో క్వాలిఫై అయ్యి, మెయిన్స్ రాయబోయే ప్రతి అర్హుడైన తెలంగాణ అభ్యర్థికి లక్ష రూపాయల ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది.

Rajivgandhi civils abhayahastam telangana govt giving rs 1 lakh financial support for civils mains candidates

సివిల్స్ రాసేవారి ఆర్ధిక భారం తగ్గించే ప్లాన్

దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్థానిక అభ్యర్థులకు కోచింగ్ స్టడీ మెటీరియల్స్ కోసం అయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడం లో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది జరిగిన upsc ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రతి అభ్యర్థి తెలంగాణకు చెందిన వారై ఉండాలి.


దరఖాస్తులు ఆన్ లైన్ లోనే.. రెండేళ్లలో 346 మంది అభ్యర్థులకు లబ్ధి

దీని కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తులు స్కూటీని ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులకు ఖాతాలలో నేరుగా నగదు జమ చేయబడుతుంది. ఇప్పటివరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవతో 2024లో ప్రారంభమైన ఈ పథకం గత రెండేళ్ల కాలంలో దాదాపు 346 మంది అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది.

మరిన్ని వివరాలకు సింగరేణి అఫీషియల్ వైబ్ సైట్ లో చూడండి

వీరిలో చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకోగా, పలువురు విజేతలుగా ఫైనల్లో సత్తా చాటి సివిల్ సర్వెంట్ లుగా ఎంపిక అయ్యారు. అర్హత ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాలు మరియు మార్గదర్శకాల కోసం, ఆన్లైన్లో అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. దీనికోసం సింగరేణి అధికారిక వెబ్సైట్ www.scclmines.com ను సందర్శించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+