2-8-2001
హైదరాబాద్‌ః ఆంధ్ర ప్రదేశ్ లో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఇక మీదట పరిశ్రమలు తమ వద్ద బాలకార్మికులు లేరంటూ విధిగా ధృవీకరణ పత్రాన్ని తీసుకోవలసి వుంటుంది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై శుక్ర, శనివారాలలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సదస్సు జరిగింది. భారత దేశంలో కెల్లా అత్యథికంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే 16 లక్షల మంది బాలకార్మికులు వుండడం పట్ల ఐ.ఎల్.ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
2004 నాటికి రాష్ట్రంలో బాలకార్మికులు లేకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ప్రాధమికవిద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ సందర్భంగా చెప్పారు. బాలకార్మికులకు తగిన పునరావాసం కల్పించేఅంశంపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఈ నెల 30,31 తేదీలలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసినట్లు కూడా శ్రీహరివివరించారు.
ఈ చర్యలకు నాందిగా రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ ఇకమీదట తమవద్ద బాల కార్మికులు లేరంటూ ప్రభుత్వం నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకొనేందుకు పారిశ్రామిక వేత్తలుఅంగీకరించారు.












Click it and Unblock the Notifications