చంద్రబాబు కేరళ యాత్ర
హైదరాబాద్: రాష్ట్ర సమస్యలపై, కరవు సాయంపై రెండు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలతో నిర్విరామంగా మంతనాలు జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల విశ్రాంతి కోసం భూతల స్వర్గం కేరళకు వెళ్లారు.
పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం కార్యక్రమాలతో బిజీగా వుండే చంద్రబాబు ఈ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో తీరిక లేకుండా గడిపారు. దాంతో ఢిల్లీలో మంతనాల తర్వాత అక్కడినుంచి నేరుగా కేరళ వెళ్లిరెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా హైదరాబాద్‌నుంచి నేరుగా కేరళ వెళ్లుతున్నారు. కొచ్చి సమీపంలోని ఇడిక్కిలో ఆయన రెండు రోజుల పాటు వుంటారని అధికార వర్గాలు తెలిపాయి












Click it and Unblock the Notifications