లక్ష్మణ్‌కు విశ్రాంతి-సౌతాఫ్రికా సిరీస్‌కు రెడీ
హైదరాబాద్‌ః హైదరాబాద్ బ్యాట్స్ మన్‌వి.వి.ఎస్. లక్ష్మణ్ మోకాలిసి శస్త్ర చికిత్స అవసరం లేదని, మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి సరిపోతుందని వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం నిమ్స్ లో లక్ష్మణ్‌ఎం.ఆర్.ఐ. నివేదికను పరిశీలించిన వైద్యులు విశ్రాంతి తీసుకుంటే లక్ష్మణ్ మోకాలి వాపు తగ్గుతుందని సూచించారు. మెడిటేషన్ ద్వారా మోకాలి వాపు, నొప్పి నుంచి త్వరగా కోలుకొనే అవకాశాలున్నాయని కూడా ఆర్ధొపిడిస్ట్ రాఘవ్ దత్ సూచించనట్లు లక్ష్మణ్ చెప్పాడు.అక్టోబర్ లో జరిగే దక్షిణాఫ్రికా టూర్ కు తాను సిద్ధమవుతానని కూడా లక్ష్మణ్ తెలిపాడు.
శ్రీలంక, న్యూజిలాండ్, భారత్ ముక్కోణపు వన్డే సిరీస్ సందర్భంగా లక్ష్మణ్ మోకాలు వాచింది. దాంతో అతనికి శస్త్ర చికిత్స అవసరం అని భారత్ క్రికెట్ జట్టు ఫిజియో డేవిడ్ లాయిడ్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ వచ్చి నిమ్స్ లో ఎం.ఆర్.ఐ టెస్టు చేయించుకున్న లక్ష్మణ్ శుక్రవారం వైద్యుల్ని కలిశాడు. ఆపరేషన్ అవసరం లేదని, నాలుగు వారాల విశ్రాంతితో పూర్తిగా కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా రెండు వారాల అనంతరం మరోసారిఎం.ఆర్.ఐ. చేద్దామని వైద్యులు చెప్పినట్లు తెలిసింది.
ఇకపోతే లక్ష్మణ్ కు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమాదభీమా పాలసీఅందించడానికి ముందుకు వచ్చింది. ప్రమాద బీమాతో పాటు బ్యాగేజ్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా సంస్థ అధికారులు శుక్రవారం లక్ష్మణ్ కుఅందజేశారు. ఇదిలా వుండగా ఆస్ట్రేలియాపై తాను సాధించిన 281 పరుగులు ఇన్నింగ్స్‌విజ్డన్ ఆల్ టైమ్ గ్రేట్స్ జాబితాలో చేరడం పట్ల లక్ష్మణ్ సంతృప్తి ప్రకటించాడు.












Click it and Unblock the Notifications