స్వయంశక్తి పై మధ్యప్రదేశ్ ఆసక్తి
శ్రీకాకుళంః ఆంధ్రప్రదేశ్‌లోని స్వయం శక్తి గ్రూప్‌ల పనితీరును పరిశీలించడానికి మధ్యప్రదేశ్ నుంచి ఒక ప్రత్యేక బృందం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. 40 మంది సభ్యులతో కూడిన ఈ అధికార బృందం శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాలను సందర్శించి అక్కడ స్వయం శక్తి గ్రూప్‌లను కలుసుకుని మాట్లాడింది.
జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను కూడా కలుసుకునిస్వయం శక్తిగ్రూప్‌లను గురించి ప్రభుత్వం వారికిఅందజేస్తున్న సాయం గురించి మధ్యప్రదేశ్ బృందం తెలుసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లోస్వయం సహాయక సంఘాలు సాధించిన ప్రగతిని గురించివిని స్వయంగా పరిశీలించి ఈ తరహా గ్రూప్‌లను తమ రాష్ట్రంలో కూడా ప్రొత్సహించే ఉద్దేశ్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిశీలక బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపింది.












Click it and Unblock the Notifications