ఐటిలో ఆంధ్ర భేష్:కె.సి. పంత్
న్యూఢిల్లీ:విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లోవెనకబడి వున్నప్పటికీ ఇన్‌ఫర్మేషన్‌టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణల వంటి అధునాతనరంగాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కుతోందనిప్రణాళికా సంఘం ప్రశంసించింది. ఈ రంగాల్లో విశేషప్రగతి సాధించి ఆంద్రప్రదేశ్ దేశ, విదేశీపెట్టుబడులను సాధిస్తోందని ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు కె.సి. పంత్ అన్నారు. గ్రామాల్లోదారిద్ర్య స్థాయిని తగ్గించగలిగినందుకు ఆయనముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు.ఇ-గవర్నెన్స్, సింగిల్ విండో క్లియరెన్స్, నీటి వినియోగదారులుసంఘాలతో పాటు ప్రజా భాగస్వామ్యం వుండే వినూత్నపథకాలకు రాష్ట్రం మార్గదర్శి ఆయన కొనియాడారు.
అయితే, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఒక్కటే అభివృద్ధిఅనుకుంటే చాలదని, ఈ రంగాన్ని ఇతర సామాజికరంగాలతో జోడించి సమగ్రాభివృద్ధి సాధించాల్సివున్నదని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది.రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఖరారు చేయడానికిచంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రతినిధులబృందం శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుకె.సి. పంత్ ప్రభృతులతో చర్చించింది. వివిధరంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్నిప్రణాళికా సంఘం సభ్యులు ప్రత్యేకంగా ఎత్తిచూపారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రాధాన్యం ఇవ్వాలనిసూచించారు.












Click it and Unblock the Notifications