అగ్రనేతలపై ఉగ్రవాదుల గురి
న్యూఢిల్లీ: ప్రధాని వాజ్‌పేయి, హోం మంత్రి అద్వానీతో పాటు పలువురు అగ్రనేతల ప్రాణాలకు తీవ్రవాదలు నుంచి తీవ్రమైన ముప్పుపొంచివున్నట్టుగా వార్తలు రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అగ్రనేతలపై దాడికి పాక్ దన్నుపున్న తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టుగావిశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందినట్టుగా పోలీసులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ హత్యకు ఎల్‌టిటిఇ ప్రయోగించిన తీరులో ప్రధాని వాజ్‌పేయిపై మహిళా మానవబాంబును ప్రయోగించే సన్నాహాల్లో తీవ్రవాదులు వున్నట్టుగా సమాచారంఅందిందని పోలీసులు అంటున్నారు. తీవ్రవాదుల కుట్రగురించి వెల్లడికావడంతో ఈ సారి పంధ్రాగస్టు వేడుకలకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట పర్యాటకుల సందర్శనపై ఇప్పటికే నిషేధం విధించారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా నిఘానుపెంచారు. తీవ్రవాదులు దాడులకు పాల్పడి కల్లోలం సృష్టించడానికి అవకాశం వున్న అన్ని కీలక ప్రాంతాల్లోనూ పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు.












Click it and Unblock the Notifications