పుట్టపర్తిలో ఉపరాష్ట్రపతి
అనంతపురంః ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ శనివారం నాడు సాయిబాబా దర్శనం కోసం పట్టపర్తి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చిన కృష్ణకాంత్‌కు రాష్ట్రమంత్రి నిమ్మల కిష్టప్ప జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు.
శనివారం నాడు బాబాను దర్శించుకున్న కృష్ణకాంత్ పుట్టపర్తిలోని సూపర్‌స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శించారు. సాయిట్రస్ట్ నిర్వహిస్తున్న విద్యాలయం కార్యకలాపాలను గురించి కూడా తెలుసుకున్నారు. పుట్టపర్తిలో శనివారం రాత్రి నిద్రచేసిన అనంతరం ఆదివారం నాడు మరోసారి బాబాను దర్శించుకుని వారిఆశీస్సులు తీసుకుని కృష్ణకాంత్ ఢిల్లీ తిరిగివెళ్లుతారు. కృష్ణకాంత్‌తో పాటు ఆయన బంధువులు కూడా వున్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications