ఒరిస్సా మృతుల్లో వార్ నేతలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దుల్లో వున్న ఒరిస్సాలోని రెండు పోలీసు స్టేషన్లపై పెద్దసంఖ్యలో దాడి జరిపిన నక్సలైట్లను పీపుల్స్‌వార్ దళనేతలుగా గుర్తించారు. ఈ దాడిలో అయిదుగురు పోలీసులు మరణించగా ఇద్దరు నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. మరణించిన నక్సలైట్లను కమాండర్, డిప్యూటీ కమాండర్‌గా గుర్తించారు.
వీరిద్దరు ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్ పోలీసులు గాలిస్తున్న నక్సలైట్లుగా గుర్తించారు. అయితేవీరు ఎక్కడివారు, వీరి పేర్లేమిటనే విషయం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. మోటు, కలిమెల పోలీసుస్టేషన్‌పై దాడి చేసిన నక్సలైట్లు వందల సంఖ్యలో వున్నవిషయంవిదితమే. వీరికోసం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్‌గడ్ పోలీసులుపెద్దఎత్తున గాలింపు ప్రారంభించారు. పోలీసుస్టేషన్లపై దాడిలో మరికొందరు నక్సలైట్లు కూడా మరణించివుంటారని పోలీసులు భావిస్తున్నారు. మరణించినవారి మృత దేహాలను వారి సహచరులు తీసుకుని పారిపోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నక్సల్స్ దాడిలో మరణించిన పోలీసులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications