గోదావరిలో ఆర్మీ కెప్టెన్ గల్లంతు
దుమ్ముగూడెంః ఖమ్మం జిల్లా దమ్ముగూడెం వద్ద గోదావరిలో పడవ మునిగిపోయి సైనిక దళానికి చెందిన కాప్టెన్ ఒకరు గల్లంతయ్యారు. సైనిక దళాల శిక్షణలో భాగంగా సుమారు 60 మంది సైనిక, వైమానిక, నౌకాదళం సిబ్బంది చర్ల మండలం తేగడ వద్ద తాలిపేరునుంచి పది పడవల్లో వేరువేరు బృందాలుగా విశాఖకు సాహసయాత్రగా బయలు దేరి వెళ్లుతుండగా వాటిలో ఒక పడవ బోల్తా పడింది.
పడవలోని ఆరుగురు సురక్షితంగా బయటపడగా ఒక్కరు మాత్రం గల్లంతయ్యారు. గల్లంతయిన వ్యక్తిని ఆర్మీ కాప్టెన్ హరిభగవన్ సింగ్‌గా గుర్తించారు. గల్లంతయి కాప్టెన్ జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్ రెజిమెంట్‌కు చెందినవారని తెలిసింది. గల్లంతయిన కాప్టెన్‌కోసంసైనికులు, గజఈతగాళ్లు గాలింపు జరుపుతున్నారు. తాలిపేరు నుంచి బయలుదేరి గోదావరిమీదుగా కాకినాడ చేరి అక్కడినుంచి సముద్రమార్గంలోవిశాఖకు వెళ్లడానికి సైనికులు ఈ సాహస యాత్ర చేపట్టినట్టు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications