ఢిల్లీలో బాంబు పేలుడు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు పెద్దఎత్తున విధ్వంసం సృష్టించే అవకాశం వున్నదని ఆందోళనతో వున్న పోలీసుల భయాలను నిజం చేస్తూ ఆగస్టు 15కు సరిగ్గా నాలుగురోజుల ముందే శనివారం అర్ధరాత్రి సంఘటన జరిగింది.
పోలీసులుపెద్దఎత్తున భద్రతా చర్యలను చేపట్టినప్పటికీ పోలీసుల ముందుజాగ్రత్తను సవాలు చేస్తూ సౌత్‌ఎక్స్‌టెన్షన్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది. ఆటోలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ బాంబులను తీసుకుపోతుండగా ప్రమాదవశాత్తు బాంబుపేలినట్టుగా తెలిసింది. బాంబు పేలుడులో ఆటో, కారు ధ్వంస మయ్యాయి.
అయితే నిందితులు మాత్రం గాయపడినప్పటికీ తప్పించుకుపోయారు. సంఘటన అర్ధరాత్రి జరగడంతోపెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు ప్రధాని వాజ్‌పేయితో సహా అగ్రనేతలను టార్గెట్‌గాపెట్టుకున్నట్టుగా తమకు సమాచారం అందిందని పోలీసులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ బాంబు పేలుడు సంఘటన జరిగింది. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఢిల్లీలోస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లకోసం 70 వేల మందిపైగా పోలీసులను మొహరించారు.












Click it and Unblock the Notifications