కాంగ్రెస్‌ నేతలపై లాఠీల మోత

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల ఉపాధ్యక్షుడు కోటిపాత్రుని పోలినాయుడు హత్యకు నిరసనగా శనివారం నాడు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడి చితకబాదారు.

ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎంపి వి హనుమంతరావు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, డిసిసి అధ్యక్షుడు గొర్లె హరిబాబు నాయుడు, మాజీ ఎంపి కణితివిశ్వనాథం, విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్సీ గొండు నరసింగరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పోలీసుల లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. హనుమంతరావు, హరి తీవ్రంగా గాయపడ్డారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

పోలినాయుడు హత్యపైవిచారణ జరిపించాలని, అసలైన దోషులను పట్టుకుని శిక్షించాలని కోరుతూ శాంతి యుతంగా ప్రదర్శన జరిపి ఎస్‌పికి మెమోరాండం ఇవ్వాలని భావించిన కాంగ్రెస్‌ నేతలపై ఊహించని రీతిలో పోలీసులు లాఠీలతో దాడి చేశారు. దాడి చేసి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు అక్కడే వున్న అమాయక పౌరులను కూడా కొట్టారు. లాఠీచార్జికి నిరసనగా పోలీసుస్టేషన్‌ ఎదుట బైఠాయింపు జరపడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌నేతలను పోలీసులుఅరెస్టు చేశారు. కాంగ్రెస్‌ నాయకులపై లాఠీచార్జి జరిపి వారిని అక్రమంగాఅరెస్టు చేయడాన్ని పిసిసి నేత సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నేతలను పరామర్శించేందుకు ఆయన ఆదివారం నాడు ఉదయమేశ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. పోలీసులు అమానుషప్రవర్తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+