దేశం నేతలకు ఆటవిడుపు
హైదరాబాద్‌ః తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం సకుటుంబంగా కేరళ వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ నేతలకు ఆటవిడుపు లభించినట్టయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలో వున్నా ఢిల్లీలో వున్న ఫోన్‌లు, టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా తెలుగుదేశం నాయకులను, మంత్రులను బిజీగా వుంచడం పరిపాటి.
అయితే ఈ సారి కేరళ పర్యటన సందర్భంగా ఆయన ఎలాంటి కమ్యూనికేషన్ సంబంధాలను రాష్ట్ర నేతలతోపెట్టుకోవడం లేదు. అత్యవసరమైన విషయాలు వుంటే తప్ప తనను సంప్రదించాల్సిన అవసరం లేదనిసీనియర్ నేతలకు ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని తెలసింది. దాంతో సోమవారం నాడు ముఖ్యమంత్రి తిరిగి నగరానికి వచ్చేవరకు ఎవరి సొంతకార్యకలాపాల్లో వారు తెలుగుదేశం నేతలు మునిగిపోయారు.












Click it and Unblock the Notifications