దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం నాడు గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలు వైభవంగా జరుపుకున్నారు.
కృష్ణుని జన్మస్థానంగా భావిస్తున్న మధురలో వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా దేశప్రజలకు రాష్ట్రపతి కెఆర్ నారాయణన్, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ప్రధాని వాజ్‌పేయి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్కాన్ కేంద్రాలున్న చోట ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమిని వైభవోపేతంగా జరిపారు. రాష్ట్రంలో తిరుపతిలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు












Click it and Unblock the Notifications