కాంగ్రెస్ ఆందోళనవిరమణ
శ్రీకాకుళం: పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా శనివారం సాయంత్రం నుంచి నిరవధికంగా ధర్నా జరుపుతున్న కాంగ్రెస్ నేతలు ఆదివారం మధ్యాహ్నం తమ ఆందోళన విరమించారు. జిల్లా ఎస్‌పి వచ్చి కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరావు, హనుమంతరావు నుంచి వినతి పత్రం స్వీకరించడంతో పాటు శనివారం నాటి లాఠీచార్జి సంఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తామని మాట ఇచ్చారు.
దాంతో కాంగ్రెస్ నాయకులు తమ ఆందోళనకుస్వస్తి చెప్పారు. ఎచ్చెర్ల మండలం కాంగ్రెస్ నేత పోలినాయుడు హత్యకు నిరసనగా శనివారం నాడు కాంగ్రెస్ నేతలు జరుపుతున్న ప్రదర్శిస్తున్నపై పోలీసులు లాఠీ జరిపిసీనియర్ కాంగ్రెస్ నేతలతో సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టారు. ఈ సంఘటనపై తీవ్రంగా ప్రతిస్పందించిన పిసిసి నేత సత్యనారాయణరావు ఆదివారం ఉదయంస్వయంగా బయలుదేరి శ్రీకాకుళం వచ్చారు. ఎంఎస్ వచ్చేవరకు కాంగ్రెస్ నేతలు పోలీసుస్టేషన్‌ముందు బైఠాయింపు కొనసాగించారు.
కాంగ్రెస్ నేతలపై లాఠీల మోత












Click it and Unblock the Notifications