ములాయం సరసన చేరినఅగర్వాల్
లక్నోః రాజ్‌నాథ్ సింగ్ ప్రభుత్వం నుంచి ఉద్వాసనకు గురైన లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్ నేత నరేష్ అగర్వాల్ సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్‌తో చేతులు కలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం అక్రమాలను వెలికి తీయడానికి ఎస్‌పితో కలసి పనిచేయాలని నిర్ణయించినట్టుగా నరేష్ అగర్వాల్ చెప్పారు. మంత్రివర్గం నుంచి తనను తొలిగించడంతో వైశ్యుల్లో బిజెపి పలుకుబడి పూర్తిగా దెబ్బతింటుందని ఆయన చెప్పారు.
గతంలో కూడా తమ కమ్యూనిటికే చెందిన ముఖ్యమంత్రి రామ్ ప్రకాష్ గుప్తాను కూడా బిజెపి వెన్నుపోటు పొడిచిందనిఅగర్వాల్ ఆరోపించారు. వైశ్యులు సంఘటితమై బిజెపికి గట్టి బుద్ది చెప్పడం ఖాయమని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌అయిన అగర్వాల్‌కు సొంత పార్టీలో కూడా చుక్కెదురయింది. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో 16 మంది అడ్డంతిరిగిఅగర్వాల్‌నే తాము పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. తిరుగుబాటు గ్రూప్ తమకే మెజార్జీ వున్నదని ప్రకటించడంతో పాటు ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తాము బేషరతుగా మద్దతు కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications