రైల్లో బాంబు పేలి ముగ్గురి మృతి
న్యూఢిల్లీః హరిద్వార్ నుంచి ఢిల్లీ వస్తున్న రైల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు మరణించారు. ఈ పేలుడులో రైల్లోని ఒక బోగి పూర్తిగా ధ్వంసమైంది.
ఈ సంఘటనలో మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘజియాబాద్-మీరట్‌సెక్షన్‌లోని మోడినగర్-మురద్‌నగర్ స్టేషన్ల మధ్యరైలు వెళ్తుండగా ఈ పేలుడు సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ప్రాంతం ఢిల్లీకి సమీపంలోనే వుంది. గాయపడిన వారిని వెంటనే మురద్‌నగర్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతోస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications