మృతదేహంతో కాంగ్రెస్ ధర్నా
అనంతపురం: యాడికి మండలాధ్యక్షుడు బాలసతీష్ హత్యకు నిరసనగా అనంతపురంలోని ఎస్‌పి క్యాంప్ ఆఫీసు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు రెండు గంటల పాటు బైఠాయింపు జరిపారు. బాల సతీస్ మృతదేహాన్ని కార్యాలయం ముందు వుంచి వారు ధర్నా నిర్వహించారు. ఎస్‌పి పచ్చా చొక్కా వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారని, రక్షణ కోసం గన్‌మన్‌ను ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోలేదని వారు నినాదాలు చేశారు.
జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్‌విజయాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ వారిపై దాడులకు, హత్యకాండకు పాల్పడుతున్నారని ధర్నాకు నాయకత్వం వహించిన సిఎల్‌పి ఉపనాయకుడు జె.సి. దివాకర్ రెడ్డివిమర్శించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో నూరు మంది శాసనసభ్యులతో అనంతపురంలో ధర్నా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
హత్యకు బాధ్యులైనవారిని వెంటనే అరెస్టు చేస్తామని ఎస్‌పి హామీ ఇచ్చారు. పోలీసు అధికారుల హామీతో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నావిరమించారు. అనంతరం అంత్యక్రియలు నిమిత్తం బాల సతీస్ మృతదేహాన్ని అనంతపురం నుంచి యాడికి తీసికెళ్లారు. బాల సతీష్ హత్యకు నిరసనగా ఈ నెల 16వ తేదీన బంద్ నిర్వహించాలని కాంగ్రెస్,సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) యూనిటీ ఇన్షియేటివ్ నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications