పిసిల మనుగడ మరో పదేళ్లు !!
బెంగుళూరుః ఇరువై ఏళ్ల క్రితం వేలాది మంది విమర్శకుల నోటికి తాళం వేస్తూ ఐబిఎం మార్కెట్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన పర్సనల్ కంప్యూటర్ మరో అయిదు పదేళ్ల కన్నా మించి మనుగడ సాగించడం కష్టమని నిపుణులు అంటున్నారు. రోజురోజుకు ప్రాసెసింగ్ పవర్ సైజ్‌ను కదించడంతో శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయం వల్ల నేటి పీసీలే రేపటినాటికి బల్క్‌గా కనిపించే అవకాశం వున్నదని అంటున్నారు.
రానున్న రోజుల్లో కంప్యూటర్ల సర్వాంతర్యామిగా వుంటాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పిసి కంటే అనేక రెట్లు శక్తిమంతమైన ప్రాసెసింగ్ సామర్ధ్యం గల పిసిలను రిస్ట్‌వాచ్‌లో ఇముడ్చుకునే రోజువస్తుందని వారు అంటున్నారు. అయితే బిజినెస్ అవసరాలు, వ్యక్తి గత అవసరాల కోసం మరికొన్నేళ్లపాటు ప్రస్తుత రూపంలోని పిసి కొనసాగే అవకాశం వున్నదని వారు అంటున్నారు. ఇన్ఫర్మేషన్ క్రియేషన్, మానిప్యులేషన్ కోసం ప్రస్తుత రూపంలోని పిసి చాలా వెసులుబాటుగా వుంటుందని వారు చెప్పారు.
ఏ ఏడాది కా ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనూహ్యంగా పెరిగిపోతున్నప్పటికీ పెరుగుతున్న ప్రాసెసింగ్ పవర్‌కు అనుగుణంగా అప్లికేషన్స్ దొరుకుతాయా అన్న అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే వందేళ్ల డివిడి క్వాలిటీ విడియోను అరచేతిలో పట్టే డిస్క్‌లో స్టోర్ చేయగలమని వారు అంటున్నారు. ఒక వ్యక్తి నిండుగా నూరేళ్లు బతికితే అతని జీవితాన్ని మొత్తం విడయో తీసి అందులో స్టోర్ చేయగల అవకాశం వుంటుంది. వైర్ లెస్ టెక్నాలజీ వల్ల మనతోనే మన పిసిలను మోసుకుతిరుగుతున్న ఇంటర్నెట్ సౌకర్యానికి మాత్రం ఢోకా వుండదని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications