దొరకని కృషి బ్యాంక్‌ చైర్మన్‌, డైరెక్టర్లు

హైదరాబాద్‌: కృషి బ్యాంక్‌వివాదం సోమవారం కొత్త మలుపు తిరిగింది. చైర్మన్‌, జనరల్‌ మేనేజర్‌లతో సహా డైరెక్టర్లందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బిఐ) అధికారుల సలహా మేరకు డిపాజిట్‌ హోల్డర్లు, ఖాతాదారులు సమిష్టిగా బ్యాంక్‌ను తామే నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మహంకాళి పోలీసుస్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వరరావు సమక్షంలో భారీ బందోబస్తు మధ్యఅసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి బ్యాంకు తాళాలు తీశారు.

కృషి బ్యాంక్‌ను ఎత్తేయనున్నారనే వదంతులు వ్యాపించడంతో ఆందోళన చెందిన ఖాతాదారులు శనివారంపెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకుని తమ డిపాజిట్లను తీసికెళ్లేందుకు సిద్ధమయ్యారు. వందల సంఖ్యలో గుమిగూడిన ఖాతాదారులకు ఒకేసారి చెల్లింపులు సాధ్యం కావని గ్రహించినఅసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి పోలీసుల రక్షణకోరారు. ప్రశాంతంగా వుంటే అందరికీ చెల్లింపులు చేయగలమని కూడా హామీ ఇచ్చారు. బ్యాంక్‌ను ఎత్తేయనున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లో సమాచారంఅందించడంతో తమ సొమ్ము అప్పటికప్పుడు చెల్లించాలంటూ ఖాతాదారులు పట్టుబట్టారు. బ్యాంకు డైరెక్టర్లకు రక్షణ కల్పించాలని పోలీసులు చూశారు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఖాతాదారులు మరింత ఆందోళన చెందారు. బ్యాంక్‌ డైరెక్టర్లలోఒకరైన శ్రీధర్‌ సాయంత్రం నాలుగు గంటలకు బ్యాంక్‌కు వస్తున్నట్లు చెప్పి రాలేదు.

ఈ పరిస్థితిలో ఖాతాదారులు సోమవారం ఉదయమే బ్యాంక్‌ వద్ద, పోలీసుస్టేషన్‌ వద్ద గుమికూడి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు డైరెక్టర్లను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలువిఫలమయ్యాయి. ఒక డైరెక్టర్‌కు చెందిన టాటా ఇండికా కారును మాత్రంస్వాధీనం చేసుకోగలిగారు. జూబిలీహిల్స్‌లోని బ్యాంక్‌ చైర్మన్‌ వేంకటేశ్వరరావు ఇంటికి వెళ్లగా గత కొంత కాలంగా ఆయన ఇంటికి రావడం లేదని, ఆ ఇంటిలో ఆయన అద్దెకు మాత్రమే వుంటున్నాడని తెలిసింది. దీంతో చైర్మన్‌తో పాటు డైరెక్టర్లందరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు పరిస్థితిని ఖాతాదారులకువివరించారు.

పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు ఆర్‌బిఐని సంప్రదించారు. ఆర్‌బిఐ అధికారుల సూచనల మేరకు బ్యాంక్‌ను ఖాతాదారులు, డిపాజిట్‌ హోల్డర్లు నడిపించాలని
నిర్ణయించుకున్నారు.


సంక్షోభంలో కృషి బ్యాంక్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+