ఏడాదిలోగా పాక్ లో ప్రజాస్వామ్యంః ముషారఫ్
ఇస్లామాబాద్‌ః వచ్చే ఏడాదిఅక్టోబర్ నాటికల్లా పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని సైనికాధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు. పాకిస్తాన్ జాతీయోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన పాక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వివిధఅంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడాదిలోగా పాక్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు.
ఇరుగుపొరుగు దేశాలతోస్నేహ సంబంధాలను నెలకొనాలన్నదే పాక్ అభిమతమని ముషారఫ్ చెప్పారు.అందుకే భారత్ తో చర్చలు జరుపామని తెలిపారు. కాశ్మీర్‌అంశంపై చర్చ జరగనిదే ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం లేదని ఆగ్రా సదస్సులో తేల్చి చెప్పినట్లు ముషారఫ్ ప్రకటించారు.
పాకిస్తాన్ లో మత సామరస్యం వెల్లివిరియాలని, ప్రజలు సుఖశాంతులతోవిలసిల్లాలనేదే తన అభిమతమని ముషారఫ్ అన్నారు.












Click it and Unblock the Notifications