వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ర్యాలీపై రభస-ఉభయసభలు వాయిదా
న్యూఢిల్లీః చెన్నయ్ లో డిఎంకె ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండ మంగళవారం కూడా పార్లమెంటు ఉభయ సభలను కుదిపి వేసింది. డిఎంకె-ఎఐఎడిఎంకె సభ్యులు తీవ్రస్థాయిలో వాగ్వివాదాని దిగడంతో లోక్ సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభంఅయిన మరుక్షణం నుంచి డిఎంకె సభ్యులు సభను అడ్డుకున్నారు. అన్నాడిఎంకె సభ్యులు కూడా వెల్ లోకి దూసుకువచ్చి వాగ్వివాదానికి దిగడంతో సభలో ఏం జరుగుతున్నదోఅర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీనితో సభలను ఓ గంటసేపు, ఆ తరువాత 16వరకు వాయిదా వేస్తున్నట్లుస్పీకర్ బాలయోగి ప్రకటించారు.
రాజ్యసభలో కూడా ఇదేపరిస్థితి. సభ ప్రారంభం నుంచి డిఎంకె-అన్నాడిఎంకె సభ్యులు వాగ్వివాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. డిఎంకె సభ్యులు కావాలని సభాకార్యక్రమాలను స్తంభింప చేస్తున్నారని కాంగ్రెస్‌విమర్శించింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకె ఇలా వ్యవహరించడం తగదని వామపక్షాలువిమర్శించాయి. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఆర్జెడి సభ్యులువిమర్శించారు. అరుపులు, కేకల మధ్య రాజ్యసభ కూడా వరుసగా రెండో రోజు డిఎంకె ర్యాలీ పై వాయిదా పడింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!