వరంగల్ లో పోలింగ్ అడ్డుకున్న వార్
వరంగల్‌ః వరంగల్ జిల్లా మొగిలి చర్లలో పంచాయతీ ఎన్నికలనుపీపుల్స్ వార్ నక్సలైట్లు అడ్డుకున్నారు. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో పోలింగ్ బూత్ లో పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని నక్సలైట్లు చుట్టుముట్టారు. అధునాత ఆయుధాలతో తమను చుట్టుముట్టిన నక్సలైట్లును చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు. పోలింగ్ సామగ్రిని ధ్వంసం చేసిన నక్సలైట్లు పోలింగ్ బాక్స్ లను సమీపంలోని చెరువులోపారేశారు.
పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా పిలుపు ఇచ్చామని నక్సలైట్లు ఈ సందర్భంగా చెప్పారు. నక్సలైట్ల వద్ద మారణాయుధాలు వుండడంతో తాము వారి చర్యలను అడ్డుకోలేక పోయామని సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications