వచ్చేనెల అసెంబ్లీ ఉపఎన్నికలు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌లోని ఉయ్యూరు, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 20న ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అదే రోజు మరోఅయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, రాజస్తాన్, గుజరాత్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఉపఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 27న జారీ చేస్తారు.సెప్టెంబర్ మూడులోగా నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుంది.
ఆ మరునాడే నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువుసెప్టెంబర్ ఆరువరకు వుంటుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. అన్నే బాబురావు మృతికారణంగా ఉయ్యూరుఅసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం విదితమే. కాగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన మాజీ డిప్యూటీస్పీకర్ చంద్రశేఖర్‌రావు రాజీనామా కారణంగా సిద్ధిపేట స్థానంలో ఖాళీ ఏర్పడింది. సిద్ధిపేట ఎన్నికను టిఆర్‌ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications