ముఖ్యమంత్రిదిగ్భ్రాంతి

హైదరాబాద్‌ః ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లుతున్న పోలీసు బృందాన్ని పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు దొంగచాటున పొంచివుండి మందుపాతరతో హతమార్చిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి ప్రకటించారు.

సోమవారం నాడు ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌, డిజిపితో సహా వెళ్లి సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన పవిత్ర కర్తవ్యంలో వున్న పోలీసులను నక్సల్స్‌ కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారని ఆయనవిమర్శించారు.

నక్సల్స్‌తో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ప్రకటించినప్పటికీ నక్సల్స్‌ హింసాకాండను కొనసాగిస్తున్నరని హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ దుయ్యబట్టారు. నక్సల్స్‌కు ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఏమాత్రం గౌరవం లేదన్నవిషయం ఈ సంఘటనతో అర్ధం అవుతున్నదని ఆయన అన్నారు. గత రెండునెలల్లో వార్‌ నక్సల్స్‌ రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు పోలీసులను దారికాచి హత్యచేశారని, వరంగల్‌ జిల్లాలో పోలీసుస్టేషన్‌పై దాడి చేశారని ఆయన అన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన విధులను నిర్వహించడానికి నిరాయుధంగా వెళ్లుతున్న పోలీసు బృందాన్ని నక్సల్స్‌ మందుపాతరతో హతమార్చడాన్ని డిజిపి దొర తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లాలో కూడా నక్సల్స్‌ సంచలనం పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+