కాంగ్రెస్‌పై పథకం ప్రకారం దేశం దాడులు

హైదరాబాద్‌ః రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలపై తెలుగుదేశం దాడులు పెరిగిపోయాయని సిఎల్‌పి నేత
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

గత రెండు నెలలకాలంలో తెలుగుదేశం 16 మంది కాంగ్రెస్‌ కార్యకర్తులు, ఎన్నికల్లో పోటీచేసిన, గెలుపొందిన నాయకులను పొట్టనబెట్టుకున్నదని వైఎస్‌ ఆదివారం నాడు ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకుల హత్యపై న్యాయవిచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలను భయభ్రాంతం చేయడానికి తెలుగుదేశం రహస్య ప్రణాళికను రూపొందించినట్టుగా ఆయన ఆరోపించారు. ఈ రహస్య ప్రణాళిక ప్రకారమే కాంగ్రెస్‌ పార్టీవారిపై హత్యకాండ కొసాగిస్తున్నరని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం దాడుల్లో మరణించిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకుఅయిదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. హత్యాకాండ ఫాక్షనిజం సభాసంఘం ఏర్పాటు చేయాలని తాము ఆరునెలలుగా డిమాండ్‌ చేస్తున్నాస్పీకర్‌ ప్రతిభాభారతితో సహా అధికార పక్షం ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నదని ఆయన చెప్పారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+