తుది దశలో జోరుగా హింసాకాండ
హైదరాబాద్‌ః తుది ఘట్టం రక్త సిక్తం అయింది. నక్సల్స్ ప్రభావం కారణంగా ఉద్రిక్తంగా వుండే తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగినప్పటికీ రాయలసీమ, కోస్తా జిల్లాల్లో హింసాకాండ, ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా పడింది. చివరిఘట్టంలో బందోబస్తుకు వెళ్లుతున్న పోలీసు బృందాన్ని గుంటూరు జిల్లాల్లో నక్సల్స్ మందుపాతరతో బలితీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం అయింది.
తుదివిడత పోలిగ్ లో భాగంగా 23 రెవెన్యూ డివిజన్లలోని 7,081 గ్రామ పంచాయతీలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలు తుదివిడత పోలింగ్ జరుగుతున్న ఈ 23 డివిజన్లలోనే వున్నప్పటికీ పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంవిశేషం.
హంసాకాండ, అల్లర్ల మధ్య మొత్తానికి పోలింగ్ 76 శాతం మేర జరిగిందని అధికారులు చెప్పారు. చిత్తూరు జిల్లాల్లో ఓటు వేసి వస్తున్న ఒక యువకున్ని పోలీసులు చితకబాదగాదెబ్బలకు యువకుడు మృతి చెందినట్టుగా తెలిసింది. ఫాక్షనిజం తీవ్రంగా వున్న రాయలసీమ జిల్లాల్లోపెద్దఎత్తునే గొడవలు జరిగాయి. అనంతలో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చింది. ప్రకాశం,విశాఖ, శ్రీకాకుళం, మెదక్ జిల్లాల్లో గొడవలు జరిగాయి. మెదక్ జిల్లాలో పటాన్‌చెరువులో అల్లరికి దిగిన వర్గాలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.సమస్యాత్మక ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలన్నీ తుదివిడత పోలింగ్‌జరిగే డివిజన్లలో వుండడంతో అధికార యంత్రాంగం అసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాటుచేసింది. అయినప్పటికీ గుంటూరు జిల్లాలో బాంబుదాడులు, ఘర్షణలు జరిగాయి.












Click it and Unblock the Notifications