యువత చేతుల్లో కాంగ్రెస్ భవిత
హైదరాబాద్‌ః ప్రపంచ శాంతికోసం పరితపించిన వారిలో రాజీవ్‌గాంధీ ప్రధముడని పిసిసి నేత ఎమ్ సత్యనారాయాణరావు శ్లాఘించారు. మహాత్మాగాంధీ కలలుగన్నగ్రామస్వరాజ్యంకోసం చిత్తశుద్దితో ఆయన కృషి చేశారని సత్యనారాయణరావు అన్నారు.
రాజీవ్‌గాంధీ 57వ జయంతి సందర్భంగా యూత్‌కాంగ్రెస్ నేపథ్యంలో సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యమైన ఫలితాలను సాధించడానికి కారణం యువకులకుపెద్దసంఖ్యలో టికెట్స్ ఇవ్వడమని సత్యనారాయణరావు చెప్పారు.
రానున్నఅసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాము యూత్‌కుపెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కుపూర్వవైభవాన్ని సాధించే బాధ్యత యువకుల యువజన నేతల భుజాలపై వున్నదని ఆయన చెప్పారు. పంచాయతీలను పరిపుష్టం చేసేందుకు రాజీవ్ హాయాంలోనే 73,74 రాజ్యాంగ సవరణలు జరిపినవిషయం ఆయన గుర్తుచేశారు. ఎన్‌డిఎ పాలకులు పంచాయతీలకు అధికారల బదలాయింపునకు మొరాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఇదిలా వుండగా అంతకు ముందు పిసిసి సారథ్యంలో గాంధీభవన్‌లో జరిగిన రాజీవ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్‌సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల, రోశయ్య తదితరులు రాజీవ్‌తో తమ అనుభవాలను, రాజీవ్‌సేవలను గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications