ఖాయిలా కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఖాయిలా పడిన కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖాయిలా కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలపై వసూలు చేసే అపరాధ వడ్డీ రేటును 24 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నాడు రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో 50 నుంచి 100 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వున్న పారిశ్రామికవేత్తలు కూడాహాజరయ్యారు. ఖాయిలా వుండటం వల్ల ఎవరికీపైసా లాభం లేదని అదే కంపెనీలు నడుస్తుంటే పదిమందికి ఉపాధి లభిస్తుందనిఅందవల్లే ఖాయిలా పరిశ్రమల పునరుద్దరణకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications