సంఘ్ చేతిలో సర్కారు కీలుబొమ్మ
న్యూఢిల్లీః వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆడించినట్టల్లా ఆడుతున్నదని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ దుయ్యబట్టారు.
ఒకవైపు భాగస్వామ్య పక్షాల వత్తిడి మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మధ్య అసమర్ధతకు మారుపేరుగా ఎన్‌డిఎ ప్రభుత్వం తయారయిందని ఆమె దుయ్యబట్టారు. తప్పుడు విధానాలతో దేశానికి ఎన్‌డిఎ అనేక సమస్యలను సృష్టిస్తున్నదని ఆమెవిమర్శించారు.
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 57వ జయంతి దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కాంగ్రెస్‌సేవాదళ్ రెండు రోజుల జాతీయ సదస్సును ఆమె సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌డిఎ అసమర్ధతకు ఆగ్రా శిఖరాగ్ర సభవైఫల్యం నిలువుటద్దం పడుతున్నదని ఆమె అన్నారు.రాజీవ్‌కు ఘనంగా నివాళులర్పిస్తూ సేవాదళ్‌ను పటిష్టం చేయడానికి ఆమె తొమ్మిదిపాయింట్ల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications