బాస్మతి నిర్ధారణకు డిఎన్‌ఎ పరీక్ష
హైదరాబాద్‌ః వివిధ బాస్మతి రకాల్లో భారతీయ బాస్మతి బియ్యం విశిష్టతను ప్రత్యేకంగా గుర్తించడానికి హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రత్యేక టెక్నాలజీని డెవలప్ చేశారు. డిఎన్‌ఎ ద్వారా బాస్మతి రకాలను గుర్తించగల ఈ పరిజ్ఞానాన్ని డిఎన్‌ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బాస్మతికి ఎదురవుతున్న పోటీ, అమెరికన్ కంపెనీలు బాస్మతిపైపేటెంట్లకోసం చేస్తున్న ప్రయత్నాల్లో నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో మన బాస్మతిని మనం కాపాడుకోవడానికి ఈ కొత్త టెక్నాలజీబ్రహ్మాండమైన ఆయుధంగా ఉపకరిస్తుందనిఅంటున్నారు. జెజి నాగరాజు అనే శాస్త్రవేత్త సారథ్యంలోనిపరిశోధక బృందం డెవలప్ చేసిన టెక్నాలజీ ప్రకారం జన్యు లక్షణాల ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బాస్మతి బియ్యాన్ని వేరు చేసి చూపవచ్చు.












Click it and Unblock the Notifications