శాంతించిన వరద గోదావరి
హైదరాబాద్: గోదావరి నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లలో వర్షాలు తగ్గడంతో రాష్ట్రంలో గోదావరి వరద ఉధృతి తగ్గిందని అధికారులు చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద మట్టం గురువారం పది అడుగులు తగ్గింది. ముంపు నుంచి 18 గ్రామాలు బయట పడ్డాయి.
ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వరదలతో 1500కుపైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 17 అడుగులకు చేరవచ్చునని అధికారులుఅంచనా వేశారు. అయితే, అక్కడ 16.25 అడుగులకు మాత్రమే చేరుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలకు చెందిన 30 గ్రామాలకు చెందిన 600 కుటుంబాలు
ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వున్నారు. వరద వల్ల సంభవించిన నష్టాన్ని ప్రత్యేక బృందంఅంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications