రైలు దూసుకుపోయి ఏడుగురు పిల్లలు మృతి
పాట్నా: బీహార్‌లోని చన్‌పట్టా సమీపంలో అవధ్ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోవడంతో గురువారం ఏడుగురు పిల్లలు మరణించారు. పాట్నాకు 250 కిలోమీటర్ల దూరంలో గల చెన్‌పట్టా వద్ద రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చూస్తుండగా రైలు ఆ పిల్లలపై నుంచి దూసుకుపోయింది.
రెల్వే ట్రాక్ మరమ్మత్తులో వున్న యంత్రాన్ని చూడడంలో మునిగిపోయిన పిల్లలు ముజఫర్‌పూర్, బాంద్రాల మధ్య నడుస్తున్న అవధ్ ఎక్స్‌ప్రెస్ చక్రాల కిందికి వచ్చారు. హారన్ కొట్టి పిల్లలను డ్రైవర్ హెచ్చరించాడని, వారు హారన్‌ను వినిపించుకోలేదని, దీంతో రైలు వారిపై నుంచి దూసుకొని పోయిందని రైల్వే అధికారులన్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు వారు చెప్పారు.












Click it and Unblock the Notifications