కొలిక్కిరాని పిసిసి జాబితా
Recommended Video
108 కి ఆలస్యమవడం తో తన కారులో వెళ్ళమన్న మంత్రి || Anil Yadav Directed His Driver | Oneindia Telugu
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో సాగుతున్న నుంచి సాగుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దుల ఓటమికి ప్రయత్నించిన వారికి కార్యవర్గంలో స్థానం కల్పించకూడదని పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు గట్టిగా పట్టుబడుతున్నట్టుగా తెలిసింది.
వివాదాస్పదులుగా మారిన కొందరు నేతలవిషయంలో ఎంఎస్ పట్టుదలతో కార్యవర్గం తుదిజాబితా ఖరారులో జాప్యం జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. గురువారం నాడు హైదరాబాద్ తిరిగి బయలుదేరే వెళ్లేముందు జాబితాతో వెళ్లాలని ఆశించిన ఎంఎస్‌కు నిరాశనేమిగిలిందని అంటున్నారు. కార్యవర్గంలో కొన్ని పేర్లమీదనేపేచీ వున్నదని అధిక భాగం పేర్లవిషయంలో ఏలాంటి గొడవ లేదనిఅందువల్ల ఒకటి రెండు రోజుల్లో జాబితా ఖరారు కావడం ఖాయమనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications