దేశం నేతల నెమళ్లవిందు
కర్నూలుః గ్రామ పంచాయతీ ఎన్నికల విజయోత్సవాలను నెమళ్ల మాంసంతో జరుపుకున్న నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకులపై అటవీ శాఖ అధికారులు కేసుపెట్టారు. ఇనగండ్ల గ్రామంలో గత సోమవారం నాడు జరిగిన ఒక విందులో రెండు నెమళ్లను చంపి దేశం నేతలు విందు చేసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది.
నెమళ్లవిందు విషయం తెలిసిన ప్రత్యర్ధి కాంగ్రెస్ వర్గం పోలీసు, అటవీ శాఖ అధికారుల దృష్టికి ఈవిషయం తీసుకువెళ్లినట్టుగా తెలిసింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటీన ఇనగండ్లకు వెళ్లి దర్యాప్తు జరిపారని తెలిసింది. ఇనగండ్ల పొరుగున వున్న పలుకుదొడ్డి గ్రామం వద్ద వున్న సాగునీటి చెరువు సమీపంలోని రిజర్వ్ ఫారెస్‌ట్లో ఈ నెమళ్లను పట్టుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన మొత్తం నలుగురిపై కేసు నమోదయింది.












Click it and Unblock the Notifications