సింగరేణి అప్పుపై కేంద్రానికి బాబు వినతి

హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని మాఫీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. సింగరేణి కాలరీస్‌కు కేంద్ర ప్రభుత్వం 663 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చిందని, సింగరేణి కాలరీస్‌ లాభాల్లో నడిస్తే ఈ రుణాన్ని మాఫీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆయన గురువారంనాడిక్కడ సింగరేణి కాలరీస్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ లాభాల బాటలో పయనిస్తోందని,అందువల్ల కేంద్రం రుణం మాఫీ చేయడం న్యాయమని ఆయన అన్నారు. కార్మికులు, యాజమాన్యం కలిసికట్టుగా పని చేసి సింగరేణిని లాభాల బాటలోకి తెచ్చారని ఆయన ప్రశంసించారు. సింగరేణి కాలరీస్‌పై లక్షా పదివేల కార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా సింగరేణిని సమ్మెలకు దూరంగా వుంచడం అవసరమని ఆయన అన్నారు. కంపెనీ బాగుంటే కార్మికులు ఎవరూ అన్యాయం చేయరని ఆయన చెప్పారు. సమస్యలను ఎప్పటికప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. ఒక వేళ ఆ స్థాయిలో పరిష్కారం కాకపోతే చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధంగా వుంటానని ఆయన చెప్పారు.

కార్మికులు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం తగిన సహాయం చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+