అన్నన్‌తో దళితనేతల వాగ్యుద్ధం
డర్బన్‌ః ఐక్యరాజ్య సమితి ప్రపంచసదస్సుకు పూర్వరంగంగా గురువారం నాడు జరిగిన ఎన్‌జిఒలో సదస్సులో భారతీయ దళిత సంఘాలు మొదటిసారిగా గళమెత్తి కులవివక్షపై ప్రపంచ దేశాల దృష్టి పడేట్టుగా చేశాయి.
ఐక్యరాజ్యసమితిసెక్రటరీ జనరల్ కోఫి అన్నన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, యూరప్‌లోని రోమా తెగలగురించి, జపాన్‌లోని బురకుమిన్ల గురించి మాత్రమే ప్రస్తావించడంతో ప్రకాష్‌అంబేద్కర్ నాయకత్వంలోని ఒక బృందం ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని భారత దేశంలోని కులవివక్ష గురించి కూడా ప్రస్తావించాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా భారత్ నుంచి సదస్సుకు హాజరవుతున్న దళిత సంఘాలు, మానవహక్కుల సంఘాలుపెద్దఎత్తన నినాదాలు చేయడంతో కోఫి అన్నన్ చిరాకు పడ్డారు. భారత దేశంలోని కులవివక్షతను సదస్సు ఎజెండాలో చర్చించడానికి ఆయన వెంటనే అంగీకరించకపోవడంతో సుమారు 60 గ్రూప్‌లకు చెందిన 200 మంది ప్రతినిధులు పాటాలు, నినాదాలతో సమావేశం ప్రాంగణాన్ని హోరెత్తించారు. కుల వివక్షతను అదేపేరుతో కాకుండా వంశానుగతి
కారణంగా చేపట్టిన వృత్తుల కారణంగా వివక్షకు గురవుతున్న వారంటూ అన్నన్ ప్రస్తావించడానికి దళిత సంఘాల నేతలు తీవ్రంగా అభ్యంతరపెట్టారు.












Click it and Unblock the Notifications