జమ్మూలో ఆరుగురి కిడ్నాప్
జమ్మూ:అపహరణలకు నిరసనగా నౌషేరా పట్టణంలో బంద్ నిర్వహించినప్పటికీమిలిటెంట్లు శుక్రవారంనాడు ఆరుగుర్ని కిడ్నాప్ చేశారు. సాయుధమిలిటెంట్లు నౌషేరా తహిసీల్‌లోని చౌకియా-హండా గ్రామంలోకి ప్రవేశించిఅశోక్ కుమార్, దీప్ కుమార్, విజయ్ కుమార్‌లను తమ వెంట తీసికెళ్లారు.మిలిటెంట్లు గురువారంనాడు నౌషేరా టవున్‌లోని బుఖారీ గ్రామం నుంచి ఇద్దరు పౌరులను, కినారి గ్రామం నుంచి ఒక పౌరుడ్ని కిడ్నాప్ చేశారు.
మిలిటెంట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కిడ్నాప్‌లకు నిరసనగా నౌషేరా టవున్‌లో బంద్ జరిగింది. పరిస్థితి అదుపులో వున్నదని అధికార వర్గాలు చెప్పాయి.
మరో సంఘటనలో కాశ్మీర్ లోయలో మిలిటెంట్లు రెండు వేర్వేరు దాడుల్లో నలుగుర్ని కాల్చి చంపారు. ఇందులో ముగ్గురుఒకే కుటుంబానికి చెందినవారు.












Click it and Unblock the Notifications