కృషిపై ఆర్‌బిఐకి సిఎం లేఖ
హైదరాబాద్‌ః కృషి బ్యాంకు డిపాజిటర్లకు రావల్సిన డిపాజిట్ మొత్తాలను సత్వరం ఇప్పించడంతో పాటు బలహీన బ్యాంకులుగా గుర్తించిన అర్బన్ బ్యాంకులకు సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా సూచించాలని ఆర్‌బిఐ గవర్నర్ బిమల్ జలాన్‌ను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక లేఖరాశారు.
భవిష్యత్తులో ఇలాంటి స్కామ్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకోరారు. కృషి బ్యాంకు పరిణామాల గురించి సహకార సంఘాల రిజిస్ట్రార్ చేసిన ముందస్తు సూచనలు, రిజర్వ్ బ్యాంకు సొంతంగా చేసిన తనిఖీల్లో ఆరునెలల క్రితమే వెల్లడయిన వెల్లడయిన అక్రమాలపై సకాలంలో స్పందించకపోవడం వల్లనే కృషి కుంభకోణానికి ఆస్కారం ఏర్పడిందని ముఖ్యమంత్రి తమ లేఖలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దోషులను పట్టుకుని సివిల్, క్రిమినల్ చర్యలను తీసుకుంటుందని ఆయన లేఖలో హామీ ఇచ్చారు.
- కృషిబ్యాంకు స్కామ్ వార్తా కదంబం












Click it and Unblock the Notifications