తమిళనాడులో ఆటో ఛార్జీలు పెంపు: మినిమమ్ ఫేర్ ఇంత

ఆటో రిక్షా డ్రైవర్ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆటో ఛార్జీలను పెంచింది. పెరిగిన ఈ ఛార్జీలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి. ఉచిత బస్సును అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోడ్రైవర్లకు మెరుగైన జీవనోపాధిని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడించింది.

2013 తర్వాత తమిళనాడులో ఆటోరిక్షాల ఛార్జీలను సవరించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత వీటిని సవరించిందక్కడి ప్రభుత్వం. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆటోరిక్షా కనీస ఛార్జీ 50 రూపాయలుగా నిర్ధారించారు. 1.8 కిలోమీటర్ల వరకూ ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ కూ 25 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.. ప్రయాణికులకు.

Tamil Nadu Govt has fixed the minimum fare for autorickshaws at Rs 50 for the first 1 8 km and Rs 25 after

అలాగే.. ప్రతి నిమిషానికీ ఒక రూపాయిని వెయిటింగ్ ఛార్జీగా నిర్ధారించారు. రాత్రివేళ.. అంటే 10 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఇప్పుడున్న రేట్లకు 1.5 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఘాట్ రోడ్లల్లో ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఘాట్ సెక్షన్లల్లో కనీస ఛార్జీ 60 రూపాయలుగా నిర్ధారించారు. 1.2 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్ కూ 30 రూపాయలు అదనంగా చెల్లించేలా రేట్ ను ఖరారు చేసింది.

తమిళనాడులో ప్రతి ఇంటర్ స్టూడెంట్ కూ ఓ 'హీరో' సైకిల్, హెల్మెట్: సీఎం విజయ్ హీరోయిజం
తమిళనాడులో ప్రతి ఇంటర్ స్టూడెంట్ కూ ఓ 'హీరో' సైకిల్, హెల్మెట్: సీఎం విజయ్ హీరోయిజం

నిజానికి ఆటోరిక్షాల కనీస ఛార్జీని 60 రూపాయలకు పెంచాలంటూ కొంతకాలంగా డ్రైవర్లు డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. ఉచిత బస్సు అమలు, పెరిగిన ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, మెయింటెనెన్స్ ఖర్చు అధికం కావడంవల్ల ఛార్జీలను పెంచాలని ప్రభుత్వానికి వినతులూ పంపించారు. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంది. అటు ఆటో డ్రైవర్లను నిరాశపరచకుండా, ప్రయాణికులపై అధిక భారం పడకుండా మధ్యేమార్గంగా వాటి ఛార్జీలను పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+