చంద్రబాబుతోసీమ నేతల భేటీ
హైదరాబాద్ః తీవ్రమైన కరవు పరిస్థితిని ఎదుర్కొంటున్న రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందిగా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన తెలుగుదేశం నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునుకోరారు. తెలుగుదేశం ఆత్మపరిశీలనా సమావేశాల్లో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఈ మూడు జిల్లాల నాయకులతో చర్చించారు. రాయలసీమ జిల్లాలు కొన్నేళ్ళుగా కరవు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయని, ప్రభుత్వంఅందిస్తున్న సాయం పట్ల ప్రజలు సంతృప్తితో లేరని ఆ జిల్లాల నేతలు చెప్పారు.
ప్రభుత్వంఅందిస్తున్న సాయం రైతుల అవసరాలను తీర్చలేక పోతున్నదని వారు చంద్రబాబుకు చెప్పారు. ప్రతి చిన్నపనికి అధికారులమీద ఆధారపడాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్ల్యేలకు మరిన్ని అధికారాలు కల్పించకపోతే ప్రజల ఎదుట చులకనైపోతామని తెలుగుదేశం నేతలు చంద్రబాబుకువివరించారు. రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే ఈ ప్రాంత ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల వున్న అభిమానం తగ్గిపోయే ప్రమాదం వున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications