వార్ శిబిరంపై పోలీసుల దాడి
ఆదిలాబాద్‌ః ఆదిలాబాద్ అడవుల్లో పీపుల్స్‌వార్ పార్టీ ప్రజాగెరిల్లా సైన్యం (పిజిఎ) నిర్వహిస్తున్న శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఉట్నూరు పోలీసు స్టేషన్ పరిధిలోని రాజులమడుగు గ్రామం దుందురి అటవీ ప్రాంతంలో పిజిఎ పశ్చిమ జోన్ కమిటీ ప్లాటూన్‌కు స్పెషల్ పార్టీ పోలీసులకు మధ్య హోరా హోరీ జరుగుతున్నట్టుగా గురువారం నాడు జిల్లా కేంద్రానికి వార్తలు అందాయి.
వార్ శిబిరం వార్త తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులుఅందించిన సమాచారంతో జిల్లా కేంద్రం నుంచి అదనపు బలగాలు తరలివెళ్లాయి. హైదరాబాద్ నుంచి కూడా హెలీకాప్టర్‌లో గ్రేహౌండ్స్‌ను సంఘటన స్థలానికి తరలించారు. దాంతో అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లుతున్నట్టుగా తెలిసింది. శిబిరం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న క్లైమర్ మైన్స్‌ను తీవ్రవాదులుపేల్చివేశారని అయితే ఈ సంఘటనలో పోలీసులుపెద్దగా గాయపడలేదని తెలిసింది. ఈ సంఘటన పూర్తివివరాలు ఇంకా అందాల్సివుంది.












Click it and Unblock the Notifications