కృషి పునరుద్ధరణకు ప్యాకేజీ: వైయస్ డిమాండ్
హైదరాబాద్: కృషి కోఅర్బన్ బ్యాంక్ పునరుద్ధరణకు ఒక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృషి బ్యాంక్ డిపాజిటర్లు శుక్రవారంనాడు ఆయనను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కృషి బ్యాంక్ డపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడానికి తన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వంసీరియస్‌గా తీసుకోవడం లేదని, అందుకే సిబిసిఐడికిఅప్పగించిందని ఆయన విమర్శించారు. కాగితాలన్నీ సిబిసిఐడి వద్ద వుండడం వల్ల తామేమీ చేయలేమని రిజర్వ్ బ్యాంక్ అధికారులంటున్నారని ఆయన చెప్పారు.కృషి బ్యాంక్ వ్యవహారాన్ని వచ్చే శాసనసభా సమావేశాల్లో లేవనెత్తుతామని, కృషి బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడడానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications