నరేంద్ర సారథ్యంలో తెలంగాణ సదస్సు
హైదరాబాద్‌ః భారతీయ జనతాపార్టీ మెదక్ ఎంపి నరేంద్ర ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఫోరం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో భారీ ఎత్తున సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుకు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును ఆకాంక్షించే పక్షాలన్నీహాజరవుతాయని నరేంద్ర చెప్పారు. ఈ సభకోసంపెద్దఎత్తున జనాన్ని సమీకరిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. సదస్సు ఉద్దేశ్యాలనువివరించి తెలంగాణ రాష్ట్రా అనుకూల వాదనలు ఏకతాటిపైకి తెచ్చేందుకు తాను తెలంగాణా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించారు. సదస్సులో లక్ష్యం సాధనకోసం ఒకస్టీరింగ్ కమిటీని కూడా నియమించనున్నట్టుగా నరేంద్ర ప్రకటించారు. తెలంగాణా ఫోరం బిజెపి ప్రయోజనాలకు ఏ విధంగానూ విఘాతం కాదని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా తెలంగాణా ఫోరం ఏర్పాటు చేస్తే నరేంద్రపై తగిన చర్య తీసుకోవడం ఖాయమని బిజెపి అగ్రనాయకత్వంఅంటున్నది.
. .
- బిజెపిలో తెలంగాణా ముసలం
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!