60 మంది శాస్త్రవేత్తలు ఆస్పత్రిపాలు
హైదరాబాద్‌ః భాగ్యనగరంలోని ఓ స్టార్ హోటల్ లోవిషాహారం తిన్న 60 మంది శాస్త్రవేత్తలు అస్వస్థత పాలయ్యారు. ఒక వర్క్ షాప్ లో పాల్గొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన శాస్త్రవేత్తలు లక్డీకాపూల్ లోనిసెంట్రల్ కోర్టులో దిగారు. మూడు రోజుల నుంచి ఆ హోటల్ లో వుంటున్న ఆ శాస్త్రవేత్తలు గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనేఅస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో అనారోగ్యంపాలైన వీరందరినీ హుటాహుటిన వివిధ ఆస్పత్రులలో చేర్పించారు. శాస్త్రవేత్తలు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.
హోటల్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినందు వల్లే తమశాస్త్రవేత్తలు ఇలా అస్వస్థతకు గురయ్యారని సదస్సునిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్‌పోలీసులు స్టార్ హోటల్ యాజమాన్యంపైకేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.గురువారం రాత్రి శాస్త్రవేత్తలు వివిధ ఆస్పత్రులలోచేరారు. శుక్రవారం నాడు పరిస్థితిని వివరిస్తూ హోటల్‌యాజమాన్యానికి లేఖరాసినా పట్టించుకున్నవారు లేరని సదస్సు నిర్వాహకులు ఆవేదనవ్యక్తం చేశారు.
సొసైటీ ఆఫ్ ఇ.ఎం.సి ఇంజనీర్స్ హైదరాబాద్ చాప్టర్‌ఈ సదస్సు ఏర్పాటు చేసింది. దేశం నలుమూలలనుంచి సుమారు 70 మంది శాస్త్రవేత్తలు తరలివచ్చారు. ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగాల్సితమ సదస్సు హోటల్ యాజమాన్యం నిర్వాకంతోవిఫలం అయిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేశారు. ముంబయ్, పూనా, చండీగఢ్, చెన్నై,బెంగుళూరు నగరాల నుంచి సదస్సుకు వచ్చినశాస్త్రవేత్తలు మూడు రోజులుగా ఇలా ఆస్పత్రిపాలయ్యారు. శనివారం రాత్రి వరకు కొందరికి ఇంకావాంతులు, విరేచనాలు తగ్గలేదంటే ఆహారంఏ స్థాయిలో విషపూరితం అయిందో అర్థం చేసుకోవచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇదంతా జరిగిందా లేకఇందరు శాస్త్రవేత్తలు ఒకే చోట సమావేశం అవుతున్నందునఎవరైనా కుట్రపన్ని ఆహారాన్ని కలుషితం చేసివుంటారాఅని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications