గుత్తి జైలు నుంచి నలుగురు నక్సల్స్ పరారీ
అనంతపురంః అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైలు నుంచి శనివారం వేకువ జామున నలుగురు నక్సలైట్లు పరారయ్యారు. నక్సలైట్లు బోయ హరి తో పాటు మరో ముగ్గురు నక్సలైట్లు కూడా జైలుగది ఊచలు వంచి పరారయ్యారు. జైలులోని 9వ సెల్ లో హనుమంతు, కాశీం, రాందాస్, గోవిందు, తిమ్మయ్య వున్నారు. శనివారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో పథకం ప్రకారం వీరిలో నలుగురు పరారయ్యారు. జైలు గది ఊచలను హెక్సా బ్లేడ్ తో కోసి వీరు పరారయ్యారు.
9వ నెంబర్ గదిలో వున్న తిమ్మయ్యమినహా మిగిలిన నలుగురు పరారైనట్లు జైళ్ళ శాఖ డిఐజి రామనర్సయ్యవివరించారు. తనకు ఏవో మాత్రలు ఇచ్చారని అవి వేసుకొనే సరికి నిద్ర ముంచుకొచ్చిందని తిమ్మయ్య చెప్పారు. లేచి చూసే సరికిమిగిలిన నలుగురు పరారైనట్లు కనుగొన్నానని వివరించాడు.












Click it and Unblock the Notifications