హింసపై సభలో వాగ్యుద్ధం
హైదరాబాద్‌ః ఇటీవల జరిగిన స్థానికఎన్నికల్లో జరిగిన హింసాకాండపై బుధవారంనాడు అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యులమధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఈహింసాకాండపై న్యాయవిచారణ జరిపించాలన్నప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌నుప్రభుత్వం తిరస్కరించింది. దీంతోరెచ్చిపోయిన కాంగ్రెస్, సిపిఎం సభ్యులుసభనుంచి వాకౌట్ జరిపారు. గత రెండురోజులు జరిగిన అసంపూర్ణ చర్చనుతెలుగుదేశం సభ్యుడు పల్లె రఘనాథ్‌రెడ్డితిరిగి ప్రారంభిస్తూ, అనంతపురంలో కాంగ్రెస్‌నేత వైఎస్ ఆత్మాహుతి దళాల ఏర్పాటుకుపిలుపునివ్వడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేయడమంటేఅధికార పార్టీ సభ్యుల ప్రాణాలకు ముప్పువున్నట్టేననిఆయన అనడంతో సభలో తీవ్ర దుమారంచెలరేగింది. ఆత్మాహుతి దళాలంటే ఏమిటోతాను అదేరోజు వివరణఇచ్చానని, వివరణ ఇవ్వలేదనినిరూపిస్తే సభ్యత్వానికి రాజీనామా చేస్తాననివైఎస్ ప్రకటించారు. వైఎస్ ప్రకటనకుస్పందిస్తూ కాంగ్రెస్ అంతర్గత కలహాలు వైఎస్,జెఎస్ దివాకర్‌రెడ్డి మధ్య వున్నవిభేదాలను తెలుగుదేశం సభ్యులు ప్రస్తావించడంతోపలువురు కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యకుదూసుకువచ్చారు. ఎస్‌సి,ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధానికిజస్టిస్ పున్నయ్య కమిటీ చేసినసిఫారసులను బహిర్గతం చేయాలనిసిపిఎం డిమాండ్ చేసింది. ఈ విషయంలోప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిని వారుతీవ్రంగా ఖండించారు. సుదీర్ఘమైన గొడవతర్వాత కాంగ్రెస్, సిపిఎం సభ్యులు వాకౌట్‌చేశారు.












Click it and Unblock the Notifications